ఆరోగ్యమైన మహిళ అంగన్వాడి తోనే సాధ్యం

bsbnews
0

ఆరోగ్యమైన మహిళ అంగన్వాడి తోనే సాధ్యం 

BSBNEWS - కందుకూరు

ప్రతి మహిళ ఆరోగ్యమైన మహిళ ఆనందమైన మహిళ లుగా తయారవ్వాలంటే ఒక్క అంగన్వాడి కేంద్రం వల్లే అది సాధ్యమవుతుందని సూపర్వైజర్ యు ప్రభావతి అన్నారు. మండలంలోని మోపాడు గ్రామంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆరోగ్యమైన మహిళ బంధకరమైన మహిళ అంశంపై మహిళలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వరల్డ్ విజన్ మేనేజర్ యాసయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం తో ప్రతి మహిళ ఆరోగ్యంగా తయారవుతుందని ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆనందకరమైన జీవితం లభిస్తుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి యోగ అనేది చాలా ముఖ్యమైనదని అందరూ యోగా చేయటం వలన ఆరోగ్యంగా ఉంటారని దీనిని ప్రతి ఒక్కరూ అవలంబించాలని తెలిపారు. సూపర్వైజర్ యు ప్రభావతి మాట్లాడుతూ సిడిపిఓ శర్మిష్ఠ ఆదేశానుసారం మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగా కూడా తప్పనిసరిగా చేయాల్సిందని యోగ చేయటం వలన మానసిక ఆనందం ఉంటుందని దాంతో ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటుందని ఆమె తెలిపారు. బలమైన పౌష్టికాహారం తో పాటు ప్రతి మహిళకు స్వశక్తిగా ఆర్థిక పరిస్థితులను అధిగమించే మనోధైర్యం ఉండాలని అది ఉన్నప్పుడే మహిళ ఉన్నత స్థానానికి చేరుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సుభాషిని తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)