గర్భకండ్రిక భూములకు పరిష్కారం
BSBNEWS - కందుకూరు
కందుకూరు నియోజకవర్గంలో ఉన్న వేల ఎకరాలు విస్తీర్ణంలో గర్భ కండ్రిక భూముల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు త్వరలోనే పరిష్కారం చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమల శ్రీ పూజ తెలిపారు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గర్భ కండ్రిక సంబంధించిన భూములలో నివాసం ఉన్నటువంటి ప్రజలకు వారికి ఇచ్చేటట్లు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని వాటికి సంబంధించి త్వరలోనే అర్జీలను తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. వచ్చిన అర్జీలను పరిశీలించి గర్భకండ్రిక భూముల్లో నివాసముంటున్న ప్రజలకు రిజిస్ట్రేషన్ చేతికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే రిజిస్ట్రేషన్ కు స్థలాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను చెల్లించాల్సి వస్తుందని ఆమె తెలిపారు. ఇనాం భూములు ఉన్న కారణంగా ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆమె తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా రైతులు సాగులో ఉన్న రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వం గుర్తించి వారికి రిజిస్ట్రేషన్లు చేసే విధంగా చర్యలు చేపట్టిందని ఆమె తెలిపారు.