సేవా కార్యక్రమాలతో నేను చాలా సంతోషంగా ఉంటాను
*వి.పి.ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ పంపిణీ చేసిన ఎంపీ వేమిరెడ్డి
ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ఇంటూరి
BSBNEWS - GUDLURU
విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషం కలిగిస్తుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. గుడ్లూరు మండలంలో ఆదివారం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలోని సుమారు 150 మంది వికలాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ ను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వి పి ఆర్ ఫౌండేషన్ ద్వారా చాలా సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని కోరారని, తమ సభ్యులు ఆయా గ్రామాల్లో పర్యటించి త్వరలో వాటర్ ప్లాంట్ లు ఏర్పడే విధంగా కృషి చేస్తారని, వాటి పర్యవేక్షణ బాధ్యతను కూడా ట్రస్ట్ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ నెల 23వ తేదీన ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వి పి ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంపీ, నియోజకవర్గంలో వికలాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ అందజేస్తున్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, లబ్ధిదారుల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఫౌండేషన్ ద్వారా కుల మతాలకు అతీతంగా పేద పిల్లలను చదివించటం, నిరుద్యోగులకు బాసటగా వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు కల్పించడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం, నెల్లూరు జిల్లా బిజెపి అధ్యక్షులు వంశీ రెడ్డి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ హరిబాబు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు వేముల గోపాలరావు, ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, గుడ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షులు వాడి శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ పాలకుర్తి శంకర్ ఎంపిటిసి చెన్నారెడ్డి వరమ్మ, పార్టీ నాయకులు పువ్వాడి వేణు రావూరి వేణు, రాఘవులు, చిత్తారి మల్లికార్జున, పొట్టేళ్ల మురళి, పిడికిటి వెంకటేశ్వర్లు రాష్ట్ర, పార్లమెంటు, నియోజకవర్గ అనుబంధ సంఘాల నాయకులు అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.