ఖాళీ స్థలాలు పరిశుభ్రత, రహదారులు నిర్మాణం లేకుండా ప్రజలు నివసించటం సాధ్యమా.?

bsbnews
0

 ఖాళీ స్థలాలు పరిశుభ్రత, రహదారులు నిర్మాణం లేకుండా ప్రజలు నివసించటం సాధ్యమా.? 

- మున్సిపల్ అధికారులను ప్రశ్నించిన సిపిఐ ప్రతినిధి బృందం 

BSBNEWS - కందుకూరు

ప్రజలు నివసించే నివాసాల సమీపంలో పక్కన ఉన్న ఖాళీ స్థలాల పరిశుభ్రత లేకుండా, నివాసాల సమీపంలో రహదారి నిర్మాణాలు లేకుండా జీవనం నివసించటం సాధ్యమా?  అని సిపిఐ ప్రతినిధి బృందం మున్సిపల్ అధికారులను ప్రశ్నించింది. శనివారం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పోకూరి మాల కొండయ్య, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు ఆధ్వర్యంలో సిపిఐ ప్రతినిధి బృందం ఎస్కే హుస్సేన్, ద్రోణాదుల ఆదినారాయణ, బాల బ్రహ్మాచారి, ఉప్పుటూరి మాధవరావు, దుర్గాప్రసాద్, కోటేశ్వరరావు కోట రెడ్డి నగర్ ప్రాంతంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాలకొండయ్య నివాసం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చెత్తాచెదారంతో పాటు పిచ్చి పొదలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాల కొండయ్య పలుమార్లు మున్సిపల్ అధికారులకు దృష్టికి తీసుకెళ్లిన ఈరోజుకి సమస్య పరిష్కారం కాలేదు. కోటారెడ్డి నగర్ ప్రాంతంలో మరో ప్రాంతంలో పై భాగాన రహదారి నిర్మించి, కిందికు  రహదారి నిర్మాణం లేకపోవడంతో ఆ ప్రాంతంలో రహదారికి ఇరువైపులా ఉన్న ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సిపిఐ ప్రతినిధి బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా మాల కొండయ్య, సురేష్ బాబులు మాట్లాడుతూ ఇప్పటికి పలుమార్లు మున్సిపల్ అధికారులకు ప్రజలు విన్నపాలు చేసిన సమస్యలు పరిష్కారం కాలేదని. ఈనెల మూడవ తేదీ సోమవారం అధికారులను కలిసిన తదుపరి సమస్య పరిష్కారం కాకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ప్రజల కోసం ధర్నా కార్యక్రమం జరుగుతుందని స్పష్టంగా పేర్కొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)