అద్దంకి శ్రీధర్ బాబు కి పొగాకు రైతుల చిరు సన్మానం

bsbnews
0

 అద్దంకి శ్రీధర్ బాబు కి పొగాకు రైతుల చిరు సన్మానం

BSBNEWS- కందుకూరు

గత 7 సంవత్సరాలుగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు పొగాకు బోర్డులో వివిధ హెూదాలలో పనిచేసి బదిలీ అవుతున్న సందర్భంగా కందుకూరు పొగాకు బోర్డు రైతుల ఆధ్వర్యంలో సోమవారం సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా  రైతులు, పొగాకు బోర్డు సిబ్బంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు చేసిన మంచి పనులను కొనియాడారు. అనంతరం వారు మాట్లాడుతూ అద్దంకి శ్రీధర్ బాబు రైతులకి గత 2 సంవత్సరాల కాలంలో ఎటువంటి పెనాల్టీ లేకుండా అధికంగా పండించిన పొగాకును అమ్మించుట ద్వారా దాదాపు రైతులకు 100 కోట్లకు పైగా లాభం చేకూర్చారని, పొగాకు చూరను వేలం ప్రక్రియ ద్వారా అమ్మించి, పొగాకు అమ్మకాలు రైతుల అకౌంట్లోకి 15 రోజుల నుండి 8 రోజులుకు తగ్గించి వారి అకౌంట్లోకి జమ చేసే విధంగా చర్యలు చేపట్టారన్నారు. పొగాకు రైతులకు కావలసిన ఇతర ఇన్పుట్స్ సకాలంలో అందించడం, రైతు బ్యారన్ ఇన్సూరెన్స్ 2 లక్షల నుండి 6 లక్షల వరకు, పర్సనల్ ఇన్సూరెన్స్ 1 లక్ష నుండి 5 లక్షల వరకు పెంచడం వివిధ కార్యక్రమాలు చేపట్టారని, పొగాకు బోర్డు ఆధునీకరణకై సుమారు కోటి యాబై లక్షలు రూపాయలతో పొగాకు బోర్డు వేలంకేంద్రమును ఆధునీకరణ చేపట్టడం జరిగిందని అన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ పొగాకు రైతులకు సేవ చేసుకునే అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని, రైతులు అడిగిన ప్రతి అభ్యర్థనను అన్నిటినీ పరిష్కరించి రైతులు సంతోషంగా ఉండేటట్లు పొగాకు రైతుల అభివృద్ధికి పొగాకు బోర్డు ఎల్లవేళలా కృషి చేస్తుందని, గత 4 సంవత్సరములుగా పొగాకు రైతులకు మంచి ధరలు ఇప్పించడంలో పొగాకు బోర్డు తన వంతు కృషి చేసిందని, పొగాకు రైతులు అందరూ గత 7 సంవత్సరాల కాలములో అన్ని విధములుగా సహాయ సహకారములు తనకు సహకరించినందుకు ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు ప్రాంతీయ అధికారి ఎం. లక్ష్మణరావు, వేలం నిర్వహణ అధికారి (ఆక్షన్స్) కే.వి. రామాంజనేయులు, కందుకూరు -1, 2 వేలం నిర్వహణ అధికారులు ఎమ్.కిరణ్, బి. చంద్ర శేఖర్, సీనియర్ గ్రేడింగ్ ఆఫీసర్లు శివ కుమార్, రాజ్ గోపాల్, పొగాకు బోర్డు సిబ్బంది, రైతు నాయకులు తాటికొండ రమణయ్య, గుండాల కొండ రెడ్డి, వడ్లమూడి రామకృష్ణ,  పొగాకు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)