అంగన్వాడి కేంద్రంలో మహిళా దినోత్సవం, యోగా డే

bsbnews
0

అంగన్వాడి కేంద్రంలో మహిళా దినోత్సవం, యోగా డే

BSBNEWS - కందుకూరు



కందుకూరు ప్రాజెక్ట్ బి సెక్టార్ కాజీ పాలెం అంగన్వాడి కేంద్రంలో సూపర్వైజర్ లక్ష్మీదేవమ్మ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం, యోగ డే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిడిపిఓ కే షర్మిస్ట ప్రకాశం సూచనల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు. మార్చి 8 మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆరోగ్య మహిళ, ఆనంద మహిళ, న్యూట్రిషన్ డైట్ ప్లాన్ పై మహిళలకు అవగాహన కలిగించడం జరిగిందన్నారు. మహిళలు స్వయంకృషితో అభివృద్ధిలోకి రావాలని ఏ సమస్య అయినా ఎదుర్కొనే మనోధైర్యం కలిగేలా ఆడపిల్లలను తమ తల్లిదండ్రులు పెంచాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళల రక్షణకు ఎన్నో చట్టాలను తీసుకు స్తున్నారు అని వాటిని ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకొని మహిళా శక్తి ఏంటో ఈ దేశానికి చాటి చెప్పాలని ఆమె కోరారు. ప్రతినిత్యం యోగా చేయటం వల్ల ఆరోగ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో శ్రేష్టంగా తయారవుతారని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరు తమ దినచర్యలో యోగాను చేయటం చాలా మంచిదని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు రహం తునీస, నసీమా, నూర్జహాన్, జరీనా, బి పద్మావతి, బి.ఈశ్వరమ్మ, జి.చెంచురత్నం తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)